నయనతార కథానాయికగా నటించిన ఓ తమిళ చిత్రం ‘వసంతకాలం’ పేరుతో తెలుగులో అనువాదమవుతున్నది. చక్రి తోలేటి దర్శకుడు. దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్ నిర్మాత. ఈ నెల 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘కథానాయిక ప్రధాన చిత్రమిది. ఇందులో నయనతార మూగ, చెవిటి యువతి పాత్రలో కనిపిస్తుంది. ఓ ఇంటిలో తనపై జరిగిన హత్యాయత్నం నుంచి ఆమె ఎలా తెలివిగా తప్పించుకుందన్నదే చిత్ర ఇతివృత్తం. హారర్ మర్డర్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది’ అన్నారు. ఈ చిత్రంలో భూమిక, ప్రతాప్‌పోతన్ ముఖ్యపాత్రల్ని పోషించారు. యువన్‌శంకర్‌రాజా సంగీతాన్నందించారు.
వసంతకాలంలో..