ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటానికి ప్రభుత్వంతో పాటు సినీ సెలబ్రిటీలు నడుం బిగించిన సంగతి తెలిసిందే. చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం ఇప్పటికే చాలా మంది తారలు భారీ విరాళాలు అందించారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సి.సి.సి కోసం రూ.50 లక్షల విరాళాన్ని అందించనున్నట్టు పేర్కొన్నాడు. ఇప్పటికే కరోనాపై పోరాటంలో భాగంగా ప్రభాస్ .. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షల విరాళాన్నిఅందించారు. అలానే ప్రధాన మంత్రి సహాయనిధికి రూ. 3 కోట్ల విరాళాన్ని అందించిన విషయం తెలిసిందే.
లాక్‌డౌన్ వల్ల సినిమా షూటింగ్‌లన్నీ నిలిచిపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సినీ కార్మికులని ఆదుకునేందుకు సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ ముందుకు వచ్చారు. తన వంతు భాద్యతగా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటైన ’కరోనా క్రైసిస్ చారిటీ’(సి.సి.సి) కోసం రూ. 75వేల రూపాయలని విరాళంగా అందిస్తున్నట్టు పేర్కొన్నారు.